రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని.. ఎమ్మెల్సి జీవన్ రెడ్డి అన్నారు. హాత్ సే హాథ్ జో డో యాత్ర లో భాగంగా జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన  కార్నర్ మీటింగ్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ యువకులు, విద్యార్థుల బలిదానాలు కు చలించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు .తెలంగాణ ను సస్యశ్యామలం చేయాలని ఎస్ ఆర్ ఎస్ పి ఏర్పాటు చేశాం.38 లక్షల్తో  16 లక్షల ఎకరాలకు అందించాలని ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు సమయం లో 60 వేల కోట్లు ఉండగా. ఇ ప్పుడు  5 లక్షల కోట్లు అప్పులు చేశారు. జగిత్యాల జిల్లాలో జే ఎన్ టి యు, అగ్రికల్చర్ యూనివర్సిీటీ, పశు వైద్య  కళాశాల ఏర్పాటు చేసినం. జగిత్యాలలో కంటి ఆపరేషన్ చేయడం లేదు.. మాతా శిశు కేంద్రం లో వెంటిలేటర్ కనీసం సదుపాయం కూడా లేదు..జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల అనేలా అభివృద్ధి చేసిన అని అన్నారు.

నిరుపేదలకు 4000 ఇల్లు కేటాయించినం. యవర్ రోడ్డు 100 ఫీట్లు వెడల్పు చేస్తామాని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మరిచారు.. నాలుగేళ్లు ఐతుంది..ఎందుకు రోడ్డు వెడల్పు చేయడం లేదు..గ్రామాలను రిక్రియేషన్ జోన్, పరిశ్రమల జోన్, ఏర్పాటు చేయడం ఏమిటి..నిరుపేదలకు అండగా నిలవడం నా ధ్యేయం.. నా జీవితం ఉన్నంత వరకు సేవలు అందిస్తా అని అన్నారు. దళితులకు కెటాయించిన  నిధులు ఖర్చు చేయలేక ఇప్పుడు దళిత బందు అంటున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ 2022-23 లో ఎంత మందికి దళిత బందు ఇచ్చరో శ్వేత పత్రం ప్రకటించాలి. నాలుగేళ్ల లో స్వయం ఉపాధి పథకం అమలు చేయని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. కెసిఆర్ కు బలహీన వర్గాలను ఓటు అడిగే హక్కు లేదు. కల్లం దగ్గర దాన్యం కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ ది. కాంగ్రెస్ పార్టీ చక్కర ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే.. కెసిఆర్ చక్కర ఫ్యాక్టరీ అమ్మేశాడు.. నలుగురు దొరలు కలిసి చక్కర ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టారు. ఆరు నెలల్లో చక్కర ఫ్యాక్టరీ పునః ప్రారంభింస్తమని, పసుపు క్వింటాల్ కు రు.15000 ఇస్తామన్నారు.