పేదింటి పెన్నిధి సీఎం కేసీఆర్

పేదింటి పెన్నిధి సీఎం కేసీఆర్

కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో. ఎమ్మెల్యే గండ్ర

ముద్ర న్యూస్ రేగొండ:రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ షాధి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రేగొండ మండలానికి సంబంధించిన 61 మంది లబ్ధిదారులకు దాదాపు 6,107,076/-  రూపాయల విలువ గల  చెక్కులను లబ్దిదారులకు  అందజేసిన భూపాలపల్లి శాసన సభ్యులు  గండ్ర వెంకట రమణా రెడ్డి . ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, దేశంలో ఎక్కడలేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు చాలా రాష్ట్రాల్లో ఆశ్చర్యపోయారు ఇలాంటి పథకాన్ని వినూత్నంగా, పేదింటి ఆడబిడ్డలకు ఒక మేనమామ లాగా అందించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు.కళ్యాణ లక్ష్మి పథకంలో అర్హులుగా నిలవాలంటే ఎలాంటి పైరవీలకు గాని ధర్మారులకు గాని తావు లేకుండా  ముఖ్యమంత్రి  నేరుగా వారి ఖాతాలో రూ.100116/- జమ చేయడం జరుగుతుందని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సమర్థిస్తూ గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ పథకాలన్నిస్తూ పేద ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని గుర్తు చేశారు.గత ప్రభుత్వ హయాంలో 75 రూపాయలుగా ఉన్న పెన్షన్ను నేడు 2016 ఇస్తున్న ఘనత కేసిఆర్ గారిది.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నా కూడా ప్రజల్లో నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ,బిజెపి పార్టీ రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కేటాయిస్తున్నటువంటి నిధులకు తెలంగాణ రాష్ట్ర పనికి అందిస్తున్న నిధులలో చాలా తారతమ్యం ఉందని మన రాష్ట్రం నుంచి గడిచిన 9 ఏళ్లలో టాక్సీల రూపంలో లక్షల కోట్లు ఇచ్చినా కూడా మన రాష్ట్రానికి ఈ నిధులు ఇవ్వడానికి మొండి చేయి చూపుతున్న బిజెపి పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు మండల అధ్యక్షులు అంకం రాజేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ ,పి ఏ సి ఎస్ చైర్మన్ నడిపెళ్లి విజ్జాన్ రావు, పాల్గొన్నారు.