మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు..

మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు..

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలంలో శుక్రవారం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. మండలంలోని తహశీల్దారు , మండల ప్రజా పరిషత్, పోలీస్ స్టేషన్,వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి 22 తేదీ వరకు నిర్వహిస్తుందని... ఈ దశాబ్ది ఉత్సవాలలో మండల ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిత్యం కరువు కాటకాలతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు  నిత్య కృత్యంగా ఉండేవని... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషివలన గతంలో వానాకాలంలో ఎండిపోయిన చెరువులు కూడా మిషన్ కాకతీయ ద్వారా ఇప్పుడు ఎండాకాలంలో కూడా జలకలతో చెరువులు నిండుగా ఉన్నాయని అన్నారు.

అప్పుడు బీడు భూములుగా ఉండే తెలంగాణ పల్లెలు ఇప్పుడు ఎటు చూసినా కనుచూపుమేరా పచ్చని పొలాలు కనబడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రైతులు ఏటా మూడు పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్నారని, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. అంతేకాకుండా రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం, పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చెయ్యడం ఇలా రైతులకు అన్ని విధాల  సీఎం కేసీఆర్ అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండగ చేశాడని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు జూన్ 3 నాడు మండలంలోని రైతు వేదికలలో రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.ఈ జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్  కార్యక్రమంలో వెంకట రమణారెడ్డి, తహశీల్దారు మోబిన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, మండల వ్యవసాయ అధికారి రంజిత్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, రైసస  మండలాధ్యక్షులు పెనుకుల తిరుపతి,సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, సూపరింటెండెంట్ ఖాజ మొహినిద్దీన్, నయాబ్ తహసీల్దారు రవికుమార్, ఏపిఎం మట్టల సంపత్, నాయకులు ఎండి సర్వర్ పాషా ,ముద్రకొల రాజయ్య, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.