ప్రపంచ పర్యాటక కేంద్రంగా కరీంనగర్

ప్రపంచ పర్యాటక కేంద్రంగా కరీంనగర్
  • 410 కోట్లతో కొనసాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు
  • మరో 250 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి
  • విదేశాలకు ఆరుగురు సభ్యుల బృందం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కెసిఆర్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కరీంనగర్ లొనే తొలిసారి పర్యటించి అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జీవో నెంబర్ 4తో నగర రూపురేఖలను మార్చారు అన్నారు.కరీంనగర్ ను ఆనుకొని ఉన్న 24 టీఎంసీల మానేరు జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన గత పాలకులకు రాలేదన్నారు.

మానేరు నది తీరాన్ని పర్యాటకగా కేంద్రంగా మార్చుతామని సీఎం కేసీఆర్ అంటే ఎంతోమంది వ్యంగ్యంగా నవ్వారు కానీ జరిగిన అభివృద్ధిని చూసి నాడు నవ్విన నోరులే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయని  వెల్లడించారు. 9 ఏళ్లలో కరీంనగర్ రూపురేఖలు మార్చి హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా తీర్చిదిద్దాం అని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కు సరికొత్త సొబగులు అద్దాలని ఇప్పుడు మేము సింగపూర్, సీయోల్, ఒస్సొలొ పర్యటిస్తున్నాం అని చెప్పారు.మానేరు రివర్ ఫ్రంట్ ను మొదటి దశలో 3.5 కిలోమీటర్లు రెండవ దశలో 6.25 కిలోమీటర్లు  మొత్తం 10 కిలోమీటర్లలో నిర్మిస్తున్నాం అని వెల్లడించారు.ప్రపంచంలోనే కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను అధునాతనంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం అన్నారు.కేబుల్ బ్రిడ్జితో మానేరు రివర్ ఫ్రంట్ కి సరికొత్త శోభ సంతరించుకుందన్నారు.ఎం ఆర్ ఎఫ్ లో భాగంగా ఇప్పటికే బిగ్ ఓ ఫౌంటెన్ వర్క్ ప్రారంభమైంది.ఇందులో 310 కోట్లు మానేరు రివర్ ఫ్రంట్ కైతే మరో 100 కోట్లు పర్యాటకానికి కేటాయించాం అన్నారు.డ్యాము నుండి పెద్ద ఎత్తున వరద వస్తే తట్టుకునే విధంగా ఆఫ్ చెక్ డ్యాం, ఆఫ్ బరాజ్ నిర్మిస్తున్నాం అని తెలిపారు. ఆగస్టులోగా మానేరు మొదటి దశ పనులను పూర్తి చేసి 12 అడుగుల లోతు ఉండేలా నీటిని నిలిపేస్తాం అని పేర్కొన్నారు. పర్యాటకానికి కేటాయించిన 100 కోట్లలో 72 కోట్లతో బిగ్ ఓ ఫౌంటెన్,మరో 10 కోట్లను స్పీడ్ బోట్లకు కేటాయించాం ఇంకో 10 కోట్లతో ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎంట్రెన్స్ ప్లాజా నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. 

 మానేరు రివర్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ మరో 250 కోట్లు కేటాయించారు.

ఈ 250 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ లో పర్యాటకంగా ఎలాంటి ధీములు చేపట్టాలనే దానిపై ఓ డెలిగేషన్ బృందాన్ని సిఎం కేసీఆర్ విదేశాలకు పంపిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ డెలిగేషన్ బృందంలో ముగ్గురు రాజకీయ నాయకులు ముగ్గురు అధికారులు ఉన్నారు. రాజకీయ నాయకుల్లో నాతోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్  గౌడ్ ఉంటే అధికార బృందంలో కరీంనగర్ కలెక్టర్ కర్ణణ్ , రజత్ కుమార్, పర్యాటకశాఖ ఎండి మనోహర్ రావులు ఉన్నారు అని తెలిపారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక బృందం సింగపూర్ తో పాటు సౌత్ కొరియా, ఓసోలో పర్యటిస్తుందని వివరించారు.అక్కడి లేటెస్ట్ రివర్ ఫ్రంట్ లను అధ్యయనం చేసి అంతకంటే అడ్వాన్సుడ్ గా ఉండేలా మానేరు రివర్ ఫ్రంట్ ఉండాలన్నది మా లక్ష్యం అన్నారు. కరీంనగర్లో నిర్మిస్తున్న బిగ్ ఫౌంటెన్ ఒసో లోనే ఉంది. ఆ ఫౌంటెన్ను పరిశీలించి అంతకంటే అదునాతనమైన ఫౌంటెన్ను కరీంనగర్లో నిర్మించేలా అధ్యాయనం చేస్తాం అన్నారు.ఓసో రివర్ ఫ్రంట్ లోని ఎలిమెంట్లను కరీంనగర్ తీసుకురావాలన్నదే మా ధ్యేయం,సింగపూర్ లో అమెరికన్ టెక్నాలజీతో నిర్మించిన యూనివర్సల్ స్టూడియో ని అధ్యాయనం చేస్తాం అని వెల్లడించారు ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్ రావు, నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లతో పాటు పలువురు పాల్గొన్నారు