మోసపు మాటల కెసిఆర్ 

మోసపు మాటల కెసిఆర్ 
  • ఫసల్ బీమా యోజన  అమలు ఎక్కడ
  • రుణమాఫీకి ఎన్ని ఏళ్ళు  కావాలి
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రైతుల లక్ష రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి ఆధ్వర్యంలో  గురువారం కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ  కెసిఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలు చేయడంలో ఘోరంగా  విఫలమైందని ఆరోపించారు. రైతుల విషయంలో కెసిఆర్ ప్రభుత్వానికి మోసపూరిత మాటలు చెప్పడం అలవాటుగా మారిందనన్నారు.  రుణమాఫీ చేయడానికి కెసిఆర్ కి  ఎన్నేళ్ల సమయం కావాలని ఆయన ప్రశ్నించారు.  కెసిఆర్ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీపై, రైతులపై చిత్తశుద్ధి ఉంటే లక్ష రూపాయల వ్యవసాయ రుణమాఫీ హామీని వడ్డీతో సహా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రకృతి వైపరీత్యాలతో, అనుకోని పరిస్థితుల్లో  రైతుల పంటకు నష్టం జరిగితే ఆయా రైతులను ఆదుకోవడానికి కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా పంట నష్టపోయిన అనేకమంది రైతులను ఆదుకుందన్నారు. కానీ రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం బిజెపి మోడీ ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకుంటూ రైతు నోట్లో మట్టి కొడుతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవని , పంటల బీమా ను వెంటనే అమలు  చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం  రైతాంగ సంక్షేమం అభివృద్ధిని విస్మరించిందని ,కేవలం రాజకీయాలే పరమావధిగా  జీవిస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి రైతాంగ సమస్యల పరిష్కారంపై  చిత్తశుద్ధి ఉంటే  వెంటనే  రైతుల రుణమాఫీ ఫసల్ బీమా యోజన అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం రైతాంగ సంక్షేమ అభివృద్ధి కోసం కట్టబడి నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, వాసుదేవరెడ్డి ,లక్ష్మీనారాయణ , కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గంగారెడ్డి , కిసాన్ మోర్చ జిల్లా ప్రబారి సంపత్ రావు ,గుర్రాల వెంకట్రెడ్డి ,మాడ వెంకట్రెడ్డి ,రంగు భాస్కరాచారి ,సొల్లు అజయ్ వర్మ ,జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్, సమ్మిరెడ్డి ,జానపట్ల స్వామి ,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి ,శివారెడ్డి ,మోహన్ ,రమణారెడ్డి ,నారాయణ ,పూర్ణచందర్ ,దేవేందర్, అనిల్ ,ఐలయ్య ,జగ్గారెడ్డి ,రవి, కోటి ,సుధాకర్, కనకయ్య ,రవీందర్ రెడ్డి ,తిరుపతిరెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.