కుల వర్గ సమాజాన్ని అంబేద్కర్ కోరలేదు

కుల వర్గ సమాజాన్ని అంబేద్కర్ కోరలేదు

విగ్రహావిష్కరణ సభలో శ్రీధర్ బాబు

మహాదేవపూర్, ముద్ర న్యూస్: కుల విభేదాలు, వర్గ వైషమ్యాలు కలిగిన సమాజాన్ని ప్రపంచ మేధావిగా పేరు గడించిన అంబేద్కర్ ఏనాడు కోరుకోలేదని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు 8స్పష్టం చేశారు. కొందరు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కులవర్గ విభేదాలను సృష్టించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ అందరివాడని ఆయన సమానత్వం, అందరికీ విద్య, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ప్రభుత్వం మంథని నియోజక వర్గానికి చుక్క నీరు రాకుండా చేసిందని ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు నిరంజన్ విమర్శించారు. అంబటి పళ్లి సర్పంచ్ విలాసరావు మేడిగడ్డ చౌరస్తాలో సర్వాంగ సుందరంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఆవిష్కరణ అనంతరము అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ జడ్పిటిసి గుడాల అరుణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజబాబు, మహాదేవపూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎనమండ్ర వామన్ రావు, కాటారం ఎంపీపీ సమ్మయ్య, దళిత నాయకులు అన్నారం ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంకొండ సురేష్, మాల మహానాడు అధ్యక్షులు బుర్రి శివరాజు, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షులు పత్తి మల్లేష్ తో పాటు మూడు మండలాల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరాగా అంబటిపల్లి సర్పంచ్ ఎర్రవెల్లి విలాసరావు సభకు అధ్యక్షత వహించారు.