ముఖ్యమంత్రి ప్రజలకు పెద్ద జీతగాడు

ముఖ్యమంత్రి ప్రజలకు పెద్ద జీతగాడు

 బిఆర్ఎస్ నాయకుల అరాచకాలు పెట్రేగి పోయాయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్

ముద్ర, జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ నేతల అరాచకాలు పెరిగిపోయాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజురాబాద్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి ఎన్నికలు వచ్చినప్పుడే బిసి పథకాలు గుర్తుకు వస్తాయి అన్నారు. దళిత బందు విషయం లో దమ్ముంటే హుజురాబాద్ లో సైకోలు కాకుండా ముఖ్యమంత్రి చర్చకు రావాలని సవాల్ విసిరారు. దళిత బందు రెండవ విడత ఇవ్వడానికి అనేక రకాల ఇబ్బందులు పేడుతున్నారు.

ప్రతి కులాల్లో ఉన్న నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. నియోజక వర్గాల్లో ఉన్న ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయాలు కేసిఅర్ అబ్బా జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజలకు పెద్ద జితగాడు మాత్రమే అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పిఅర్సి లను వెంటనే విడుదల చేయాలన్నారు. రైతులు అమ్మిన వడ్ల పైసలు కూడా రావడం లేదన్నారు. బిఅర్ఎస్ పార్టీని ఓడించడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో కరీంనగర్ సిపి దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు ఇప్పటి వరకు లేవు అని తెలిపారు.