ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ప్రచార కార్యదర్శిగా... గిరి గౌడ్

ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ప్రచార కార్యదర్శిగా... గిరి గౌడ్

ముద్ర , కుషాయిగూడ: ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచార కమిటీ కార్యదర్శిగా ... ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కమలానగర్ కు చెందిన గిరి గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిరి గౌడ్ మాట్లాడుతూ ... నామీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి సైనికుల పనిచేస్తానని పేర్కొన్నాడు. తనకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బిజెపి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.