భద్రాచల  తలంబ్రాలను  రామరాజు కు అందజేసిన ఏఈవో శ్రవణ్ కుమార్

భద్రాచల  తలంబ్రాలను  రామరాజు కు అందజేసిన ఏఈవో శ్రవణ్ కుమార్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసి రామకోటి రామరాజు కు 100 కేజీల ముత్యాల తలంబ్రాలను భద్రాచలం దేవస్థానం వారు అందజేశారు. 25సంవత్సరాల నుండి చేస్తున్న రామ సేవను గుర్తించి భద్రాచల దేవస్థానం ప్రత్యేకంగా ఆహ్వానించి వేద పండితులు, అధికారులతో కలిసి రామకోటి రామరాజును సీతారాముల శాలువాతో గురువారం నాడు ఘనంగా సన్మానించారు. భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ... రామకోటి రామరాజు అపర రామదాసుగా గుర్తించామని వీరి సేవా ఆమోగం. అందుకే వీరికి 100కిలోల ముత్యల తలంబ్రాలను అందిస్తున్నామన్నారు. 

శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయి. అలాంటి నామాన్ని ప్రతి ఒక్కరితో లిఖిపంజేస్తూ స్వామి వారికోసం శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థను స్థాపించి 25సంవత్సరాల నుండి ఉచితం రామకోటి పుస్తకాలను అందిస్తూ భక్తిని చాటుకుంటున్న విషయాన్ని గహించి కోటి తలంబ్రాల దీక్ష అద్భుతంగా కార్యక్రమం కూడా రామకోటి సంస్థకు ఇచ్చామని ఈ కార్యక్రమం కూడా అద్భుతంగా నిర్వహించి గోటి తలంబ్రాలు మాకు అందించి భక్తిని చాటుకున్నాడన్నాడు. అందుకే ఏ సంస్థకు అధిక సంఖ్యలో ఇవ్వని తలంబ్రాలను ఈ రామకోటి సంస్థకే 100కిలోలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో ఏఈవో  రామకృష్ణ, దేవాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన అర్చకులు రామం శాస్త్రి, కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.