పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, హ్యాకింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి వీరభద్రం డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. .లైబ్రరీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణలో అన్ని రకాల పోటీ పరీక్షలు నిర్వహించే టీఎస్ పీఎస్సీ సర్వర్లు హ్యాక్ చేసి ప్రశ్నాపత్రాలు లీక్ చేయడం ద్వారా తెలంగాణ నిరుద్యోగులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతుందన్నారన్నారు. పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని , సిట్ వంటి సంస్థలకు అప్పగించడం ద్వారా ఉపయోగం లేదని అభ్యర్థులకు న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.దీనంతటికీ భాద్యత వహిస్తూ టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.