హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్
  • 70-75 సీట్లు బిఆరెస్కే
  • ఎగ్జిట్ పోల్స్ ఫాల్స్- రేపు ఎగ్జాక్ట్ పోల్స్
  • అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, ముద్ర:కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్ తప్పని, రేపు రాబోయేవి ఎగ్జాక్ట్ పోల్స్ అని, మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, 70 నుంచి 75 సీట్లు బిఆరెస్ సాదిస్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. ఎందుకంటే గత పది సంవత్సరాలుగా బిఆరెస్ పార్టీ ప్రభుత్వ పాలనను ప్రజలు కళ్లారా చూశారని, ఉత్తుత్తి హామీలు ఎవరు ఇస్తున్నారు, అమలు ఎవరు చేస్తున్నారనేది వారికి తెలుసని అన్నారు. కేసీఆర్ ఏదైనా మాట అంటే తప్పకుండా ఆమలు చేస్తారని, మోసం చేయడని ప్రజలకు తెలుసన్నారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్త అస్తవ్యస్తమైనా, తెలంగాణలో మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపలేదని, పెన్షన్లు వచ్చాయని, రైతు బందు వచ్చిందని అన్నారు. సమర్ధవంతమైన పాలనకు ఇది దిక్సూచి అని, తెలంగాణ అంటేనే కేసీఆర్- కేసీఆర్ అంటేనే తెలంగాన అని పోచారం పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్టు పోల్స్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని, పోలింగ్ ఆయిన ఆర గంటకే ఎగ్జిట్ పోల్స్ ను ఎలా చేస్తారని, ఏ ప్రామాణికాన్ని తీసుకొని అంచనా వేస్తారని ప్రశ్నించారు. కొన్ని సంస్థలకు కొన్ని పార్టీలకు మద్య ఇస్టాఇష్టాలు ఉంటాయని, అందుకే వారికి అనుకూలంగా ఎగ్జిట్ట పోల్స్ చేస్తారని అన్నారు.

రేపు కౌంటింగ్లో తెలుస్తుందని, వెయ్యి శాతం బిఆరెస్ అధికారంలోకి వస్తుందని,  కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ప్రజలకు తెలుసు కేసీఆర్ వల్లే తెలంగాన అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ పథకాలు ఆయనతోనే సాధ్యం అని అన్నారు. కాంగ్రెస్ వారు ఎన్ని డబ్బులు పంచినా, కొందరు డబ్బులు తీసుకున్నప్పటికీ కారు గుర్తుకే ఓటు వేస్తామని, పోచారంనకే వేస్తామని చెప్పారని అన్నారు. బిజెపికి 10 సీట్ల కన్నా తక్కువ వస్తాయని, ప్రదానమంత్రి వచ్చినా ప్రజలు బిజెపిని ఆదరించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితులు లేవని, ఎగ్జిట్ పోల్స్ ను చూసి వారు ఏదో జరిగిపోతుందని, అధికారంలో వస్తామని పగటి కలలు కంటున్నారని అన్నారు. బిఆరేస్ ప్రభుత్వం ఒక వేళా లేని పక్షంలో సంక్షేమ పథకాలు అమలు కాలేవని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిఆరెస్కు 70 నుంచి 75 సీట్లు వస్తాయని, ప్రబుత్వం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్ని హంగామాలు చేసినా, కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రావని అన్నారు. కాంగ్రెస్లో ప్రతీ ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సీటు కోసం  కోసం పాకులాడుతూ తెలంగాణ సంక్షేమంమాన్ని పట్టించుకోరని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్థానికేతర అభ్యర్థులు వచ్చి, డబ్బులు పంచి ఏదో చేద్దామనుకున్నా, వారిని ప్రజలు నమ్మలేదని, తనకే అందరూ మద్దతు పలికారని ఆన్నారు. అన్ని వర్గాల ప్రజలు తనకు ఓటు వేశారని, వారందరికీ దన్యవాదాలని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాదర్, రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాదర్, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు ఎండి ఎజాస్, జుబేర్, మోమన్ నాయక్ వాహాబ్ తదితరులు పాల్గొన్నారు.