జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ.

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ.
  • శుభాకాంక్షలు తెలియచేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకటరావు,  ఎస్.పి. రాహుల్ హెగ్డే.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జిల్లాలోని ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30 న పోలింగ్  ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలసి పని  చేసినందుకు అలాగే  పార్టీల ప్రతినిధులు, నాయకులకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్, జిల్లా. ఎస్.పి. రాహుల్ హెగ్డే  ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిదంగా డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కూడా సహకరించాలని, కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్లు తమ పాసుల కొరకు రిటర్నింగ్ అధికారికి ఈరోజు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.అలాగే గెలిచిన అభ్యర్థులు అదే రోజు ఎక్కడకూడా ర్యాలీలు చేపట్టారాదని, మరుసటి రోజు ర్యాలీలు నిర్వహించే  అభ్యర్థులు  ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి  ఒక ప్రకటనలో తెలిపారు.

కౌంటింగ్ రోజున మద్యం షాప్స్ బంద్ చేయాలి.

ఎన్నికల నియమావళిని షాపుల యాజమాన్యాలు తప్పక పాటించాలి.

జిల్లాలో   డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా  ఎన్నికల నిబంధనలకు లోబడి జిల్లా అంతట అన్ని మద్యం దుకాణాలు 3వ తేదీన  బంద్ చేయాలని లేనియెడల తదుపరి చర్యలు తీసుకోబడునని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.