అంగన్వాడి కేంద్రాల తనిఖీ

అంగన్వాడి కేంద్రాల తనిఖీ

ముద్ర/ వీపనగండ్ల:-అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతో విద్యా బోధన చేయాలని ఎంపీడీవో కథలప్ప అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బొల్లారంలో అంగన్వాడి కేంద్రాలను హరితహారం నర్సరీని ఆకస్మికంగా పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలకు బాలింతలకు క్రమంతప్పకుండా పౌష్టికారాన్ని అందించాలని, అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషక విలువలను ఆహారాన్ని అందించాలని, ఆటపాటలతో విద్యాబోధన చేయాలని అంగన్వాడి టీచర్లకు సూచించారు. అనంతరం హరితహారం నర్సరీని పరిశీలించి మొక్కలు పెరగడానికి సలహాలు సూచనలు చేశారు. మొక్కలను పెంచడానికి నాణ్యమైన మట్టిని వాడాలని,బెడ్లకు రెండు పూటల నీటిని పోయాలని, కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలని వాచర్లకు సూచించారు. గ్రామంలో ఇండ్ల నుంచి తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి సేగ్రిగేషన్ షెడ్లకు తరలించి కంపోస్ట్ ఏరువు తయారుచేసేలా చర్యలు తీసుకోవాలని , గ్రామంలో ఇంటి పరిసరాలతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ తిరుపతమ్మ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.