మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
  • రాజకీయాలలోనూ యువతకు ప్రాధాన్యం 
  • డోర్నకల్ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ 

 ముద్ర ప్రతినిధి మహబూబాబాద్: అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని కొన్ని సందర్భాల్లో పురుషులకన్నా పట్టుదలగా మహిళలు పని చేస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలో శనివారం మండల సమైక్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్ద పీటవేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మహిళ అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజకీయాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టుల్లో సైతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. సకల సౌకర్యాలతో కురవిలో మండల సమైక్య భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. మహిళలను నిర్లక్ష్యం చేస్తే ఏరంగంలోనూ ప్రగతి సాధ్యం కాదని, పల్లె నుండి ప్రారంభిస్తే దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాజకీయాలలో తాను సైతం యువతను ప్రోత్సహిస్తున్నానని, భవిష్యత్ తరాలకు నాయకత్వ శూన్యత ఏర్పడకూడదని ఆలోచనతో ఇప్పటినుండే యువతకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంలో అధిక శాతం ప్రజాప్రతినిధులు మహిళలే ఉన్నారని, రెడ్యానాయక్ తెలిపారు మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న తనకు మహిళ సోదరీమణుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరారు. మండల సమైక్య భవనం అభివృద్ధి పనుల కోసం 10 లక్షల రూపాయల నిధులను 15 రోజుల్లో మంజూరు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కురవి ఎంపీపీ పద్మావతి రవినాయక్, స్థానిక సర్పంచ్ నూతక్కి పద్మనరసింహారావు, ఎంపీటీసీ చిన్నంబాస్కర్, ఎంపీడీవో సరస్వతి, తహసిల్దార్ ఇమాన్యుల్ తో పాటు బారాస నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, తోటలాలయ్య, ముండ్ల రమేష్, దొడ్డగోవర్ధన్ రెడ్డి, వై సుధాకర్ రెడ్డి, గార్లపాటి వెంకట్ రెడ్డి, గుడిబోయిన రామచంద్రయ్య, నూతక్కి నరసింహారావు, బెడదవీరన్న, కొణతం విజయ్,బుక్క వీరన్న, దైద భద్రయ్య, బండారి రమేష్, ఇరుగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.