ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి వేగవంతంగా ఉండాలి.... 

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి వేగవంతంగా ఉండాలి.... 
  • అధికారులు సమన్వయంతో పని చేయాలి 
  • మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మహబూబాబాద్ లో శుక్రవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశం మందిరంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను భద్రాచలం ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ లు గౌతమ్, అంకిత్ లతో కలిసి అభివృద్ధి పథకాలైన గిరి వికాసం, గురుకులాలు, సబ్ సెంటర్లు, గిరిజన భవన్, అంగన్వాడి  భవనాలు, క్రీడా ప్రాంగణాలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరివికాస పథకాన్ని సమీక్షిస్తూ ... గిరిజన రైతుల వ్యవసాయ సేద్యం కొరకు వేసిన బోర్లకు సర్వే పూర్తి అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు వేసిన బోర్లకు  మోటార్లు బిగించాలని, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


మూడులక్షలకు పైగా ఖర్చు అయ్యే విద్యుత్ కనెక్షన్లకు ప్రత్యామ్నాయ పద్ధతులు చేపట్టేందుకు నివేదిక ఇవ్వాలన్నారు.అదేవిధంగా ఫెయిల్ అయిన బోర్లకు తగు కారణాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలన్నారు.
గురుకులాల అద్దెచెల్లింపు, సామగ్రికొనుకోలుకు జరిగిన  చెల్లింపులను ఆర్సీఓను అడిగి తెలుసుకున్నారు. 
 గిరిజన సంక్షేమ శాఖ లో పనిచేస్తున్న వారి వేతనాల చెల్లింపులు వెంటనే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద నిర్మిస్తున్న సబ్ సెంటర్ల ప్రగతి పై సమీక్షిస్తూ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, అదనపు గదుల నిర్మాణాల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు.


గార్ల సిఎస్ సి అభివృద్ధి కి చర్యలు తీసుకుంటామని, డోర్నకల్ గిరిజన సంక్షేమభవనం పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.గోవిందాపురం, రేకులతండ, అన్నారం బిటిరోడ్ల పనులను సమీక్షించారు.

కొత్తగూడ, సీరోల్ ఈఎంఆర్ఎస్ లలో మంజూరైన క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్డీఓ సన్యాసయ్య, ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఎర్రయ్య, ఆర్సీఓ రాజ్యలక్ష్మి, వైద్యాధికారి హరీష్ రాజ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత తదితరులు పాల్గొన్నారు