బ్యాంకర్లు నిర్దేశిత రుణ లక్ష్యాలను చేరుకోవాలి  జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

బ్యాంకర్లు నిర్దేశిత రుణ లక్ష్యాలను చేరుకోవాలి  జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

ముద్ర ప్రతినిధి,  వనపర్తి  : 

బ్యాంకర్లు నిర్దేశిత రుణ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ మీటింగ్ 
లీడ్ బ్యాంక్  వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో డిసిసి సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
డి సి సి అజెండా
 అంశాలు చర్చించారు. ఎస్ హెచ్ జి రుణాలు 100% ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రైతులకు అవగాహన కల్పించి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయాధికారులు బ్యాంకర్లు  ప్రతి మూడవ శుక్రవారం యఫ్. యల్. సి క్యాంపు లు  నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలిపారు. మైక్రో స్మాల్ మీడియం లోన్లు ఇవ్వాలని ఆయిల్ ఫామ్ రైతులకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పిఎం ఈజీ కింద దరఖాస్తు చేసిన వారికి తప్పక రుణాలు ఇవ్వాలన్నారు. ఐ డి ఓ సి కార్యాలయంలో బ్యాంకు తెరవాలని ఏటీఎం ప్రారంభించాలని  బ్యాంకర్లను కోరారు. బ్యాంకర్లు సిబిల్ స్కోర్ లేదు అని రుణాలు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని సబ్సిడీ తప్పక వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారి బ్యాంకర్లకు తెలిపారు.
ఈ సందర్భంగా
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అమూల్ పవర్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్లాన్ (ఎఫ్‌ఐపి) కింద పురోగతిని సమీక్షించడం జరిగిందని ఐటీ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను నిరోధించే మరియు ఎనేబుల్ చేసే నిర్దిష్ట సమస్యలు, సమ్మిళిత వృద్ధికి బ్యాంకింగ్ అభివృద్ధికి ఆటంకాలను ఎనేబుల్ చేయడానికి మరియు తొలగించడానికి/కనిష్టీకరించడానికి సమస్యలు పై చర్చించడం జరిగింది.
ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు (FLC) మరియు RSETI ఏర్పాటు వంటి బ్యాంకులు,  రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 'క్రెడిట్ ప్లస్' కార్యకలాపాలను అందించడానికి మానిటరింగ్ చొరవలు, 
వ్యాపారాలను నిర్వహించడానికి నైపుణ్యాలను,  సామర్థ్యాన్ని పెంపొందించడానికి శిక్షణా సంస్థలను, ఆర్థిక చేరికను సాధించడానికి ఆర్థిక అక్షరాస్యత ప్రయత్నాలను పెంచడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా క్రెడిట్ ప్లాన్ కింద బ్యాంకుల పనితీరుపై సమీక్ష, ప్రాధాన్యతా రంగానికి సమాజంలోని బలహీన వర్గాలకు రుణాల ప్రవాహం ,
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం జరుగుతుందన్నారు.
 ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద సహాయం. SC/ST/BC/మైనారిటీల కార్పొరేషన్/PMEGP/PMFME DIC/KVIC/KVIB/SUI/MUDRA యొక్క సమీక్ష, 
ఎస్ హెచ్ జి బ్యాంకు లింకేజీలో పురోగతి, విద్యా రుణాల మంజూరు,
ఎస్ ఎం ఈ ఫైనాన్సింగ్ మరియు ఏవైనా అడ్డంకులు ఉంటే,
బ్యాంకుల ద్వారా సకాలంలో డేటా సమర్పణ.
 ఇతర ఎజెండా అంశాలు చర్చించారు.  ఈ సమావేశంలో ఎల్డీఎం అమూల్ పవర్, డి ఆర్ డి ఓ నరసింహులు, వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, మల్లికార్జున్, యాదగిరి హార్టికల్చర్ అధికారి సురేష్, వెటర్నరీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, డి. టీ. డి. ఓ.శ్రీనివాసులు, ఏపిఎంలు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.