త్రాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

త్రాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
  • సర్వ సభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి

ముద్ర,పానుగల్:- వేసవి కాలం నేపథ్యంలో గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్,ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.మంగళవారం పానుగల్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశంను ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రస్తుతం త్రాగు నీటి సమస్య నెలకొందని అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.గ్రామాలలో బోర్లు,బావులను లీజుకు తీసుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.రాజకీయాల అతీతంగా పని చెయ్యాలని,ఉద్యోగులు ఏక పక్షంగా వ్యవహరిస్తే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవన్నారు.విద్య,వైద్య రంగాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని తద్వారనే గ్రామ సమస్యలు పరిష్కరించబడతాయని వారన్నారు. మండల స్థాయి అధికారులు తమ శాఖల పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి చంద్ర శేకర్ నాయక్,వైస్ ఎంపీపీ కవిత దశరథ్ నాయుడు, ఎంపిడిఓ కోటిశ్వర్,డిటీ అశోక్ కుమార్,ఎంపీఓ రఘురామయ్య,వివిధ శాఖల అధికారులు,ఎంపీటీసీలు,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.