గుండె జబ్బుల నివారణ పై ప్రముఖ వైద్యులచే సెమినార్

గుండె జబ్బుల నివారణ పై ప్రముఖ వైద్యులచే సెమినార్

ముద్ర. వనపర్తి ప్రతినిధి:- వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ సివి రామన్ టాలెంట్ స్కూల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు గుండెజబ్బుల నివారణ పై ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ మురళీధర్ తెలిపారు. మన ఆరోగ్యం౼మన చేతుల్లోనే కార్యక్రమంలో భాగంగా గుండె జబ్బులు రాకుండా ఎలా నివారించాలో అనే అంశంపై ప్రముఖ వైద్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి చే సెమినార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని,అరోగ్య అంశాల పట్ట ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్యుల ఇచ్చే సలహాలు సూచనలు పాటించి గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవాలని డాక్టర్ మురళీధర్ తెలిపారు.