టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడిగా  ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఏనుగుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన టీ జీ ఓ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను  జగిత్యాల జిల్లా గెజిటెడ్ ఆఫిసర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో అభినందించి  సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిజి ఓ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగుల సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, ఉపాధ్యక్షులు డాక్టర్ బద్దం రాజేంధర్ రెడ్డి, జీఎస్ ఆర్ విజేందర్  పాల్గొన్నారు.