24 దేవాలయాలకు దూప దీపం నైవేద్య ఉత్తర్వులు జారీ

24 దేవాలయాలకు దూప దీపం నైవేద్య ఉత్తర్వులు జారీ
  • మంత్రి కొప్పుల ఈశ్వర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం లో గ్రామీణ ప్రాంతాల్లో 24 దేవాలయాలకు దూప దీపం నైవేద్యం పథకాన్ని వర్తింపజేస్తు ఉత్తర్వులు జారీ అయినట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. దూప దీపం నైవేద్యం పథకం కింద ఆదాయం లేని ఆలయాలకు ప్రతి నెలకు రూ . 6 వేలు  చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని, ఇందులో రూ. 2 వేలు ధూప దీపం నైవేద్యాలకు, మిగిలిన రూ .4 వేలు అర్చకులకుఅని తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ధూప దీపం నైవేద్యం 10 వేలకు త్వరలో పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, గోపాల్‌పూర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి,  ధర్మపురి మండలం బూరుగుపల్లి శ్రీ ఆంజనేయస్వామి,  దొంతపూర్ శ్రీ ఆంజనేయ స్వామి , గాదెపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి, గుండాయపల్లే  శ్రీ గుండు ఆంజనేయ స్వామి, ధర్మపురి పట్టణంలోని   శ్రీ ఓంకారేశ్వర స్వామి, నర్మధేశ్వర స్వామి, గొల్లపల్లి మండలం లక్మీపూర్ శ్రీ గట్టు ఆంజనేయ స్వామి, రాఘవపట్నం శ్రీ గుండు ఆంజనేయ స్వామి, రంగధామునిపల్లి శ్రీ రంగనాథ స్వామి, పెగడపల్లి మండల కేంద్రంలో శివ మార్కండేయ, ముద్దులపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, సుద్దపల్లి అభయాంజనేయ స్వామి, వెల్గటూర్ మండలం జగదేవ్ పేట శ్రీ నగర వేంకటేశ్వరుడుస్వామి, కొండాపూర్ శ్రీ శివాలయం (మహదేవస్వామి), కొత్తపేట శ్రీ సీతారామాంజనేయ స్వామి,ముత్తునూరు శ్రీ రామాంజనేయ స్వామి, రాజారాంపల్లి శ్రీ అభయవీరాంజనేయ స్వామి, పైడిపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, కటికనపల్లి శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి, కొత్తపల్లి శ్రీ అభ్యంజనేయ స్వామి, జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎంపిక అయినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అలయ నిర్వాహకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.