కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులకు సన్మానం

కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులకు సన్మానం

ముద్ర.వీపనగండ్ల:-కానిస్టేబుల్ గా ఎంపికై శిక్షణకు వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులను గ్రామస్తులు శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. మండల పరిధిలోని గోపాల్ దిన్నె గ్రామానికి చెందిన మిట్ట కడుపుల భాస్కర్,మిట్ట కడుపుల శివకుమార్  లు వెనుకబడిన గోపాల్ దిన్నె గ్రామంలోనే చదువుకొని  పోటీపరీక్షలో కానిస్టేబుల్ గా ఉద్యోగాలు సాధించటం కర్షించదగ్గ విషయమని  సంఘం జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి,తాజ మాజీ సర్పంచ్ విజయ్ లు అన్నారు.వీరిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని విద్యార్థులు, యువకులు రానున్న ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రామానికి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని వారు కోరారు.రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు వివిధ సౌకర్యాలు కల్పించడం కోసం గ్రామ రైతులు, ప్రజా ప్రతినిధుల  సహకారంతో స్కూల్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని వారన్నారు.సన్మానం పొందిన భాస్కర్, శివకుమార్  మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని, మా తల్లిదండ్రుల శ్రమ మరువలేమన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు చదువును ఇష్టంగా చదివి ప్రయోజకులు కావాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి విక్రమ్,మాజీ సర్పంచ్ కురుమయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఎల్ల స్వామి, గ్రామ రైతులు వెంకటయ్య, నడిపి కృష్ణయ్య, టీచర్ బాల గౌడు,సత్తెమ్మ, తల్లిదండ్రులు మిట్ట కడుపుల నరసింహ, మెట్ట కడుపుల బక్కయ్య, గ్రామ యువకులు రాజు, శాంతయ్య, సుధాకర్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.