వికసించిన మే పుష్పం

వికసించిన మే పుష్పం

కేసముద్రం, ముద్ర: ప్రత్యేక మే నెలలోనే వికసించి ‘మే ' పుష్పంగా పేరు గడిచిన లిల్లీ జాతి మొక్క (దుంప)ను ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ విజయలలిత నాలుగేళ్ల క్రితం వైజాగ్ నుంచి తెచ్చి నాటారు. రెండు రోజుల క్రితం ఆ మొక్క పుష్పాలు పూయడం ఆరంభించింది.

అరుణ వర్ణంలో చూడముచ్చటైన బంతి ఆకారంలో పూసిన పుష్పాలను పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూలు పూస్తుందని.. అదికూడా మే నెలలోనే పూయడం ఈ మొక్క ప్రత్యేకతని విజయ లలిత తెలిపారు.