చదరంగం ఆట పిల్లలలో మేధా శక్తిని పెంచుతాయి

చదరంగం ఆట పిల్లలలో మేధా శక్తిని పెంచుతాయి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:  చదరంగం ఆట పిల్లలలో శ్రధ్ద, ఆసక్తిని, మేదా శక్తిని పెంచుతాయని బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు    గండూరి క్ర్రపాకర్ అన్నారు.
 విద్యానగర్ 45 వ వార్డు గండూరి రామస్వామి ఉచిత వాటర్ ప్లాంట్ నందు వేసవి సెలవులలో  ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అందించే ఉచిత శిక్షణను ఆయన గురువారం ఉదయం  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చదరంగం ఆట రాజుల కాలంలో ప్రాచుర్యం పొందిందని,  మంత్రి, ఏనుగు, గుర్రం, ఒంటె , బంటులతో  తన రాజును కాపాడుకోవాలనే లక్ష్యంతో చదరంగం ఆట నడుస్తుందని ఆయన అన్నారు. 8 నిలువు గడులు ఫైల్స్ , అడ్డ గడులు ర్యాంకులతో 64 గదులతో చదరంగం ఆట పిల్లల నైపుణ్యతను పెంచుతుందని ఆయన అన్నారు.

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో పిల్లల కోసం పార్క్ లు, జిమ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, మంత్రి జగదీష్ రెడ్డి స్ఫూర్తితో విద్యానగర్ లో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా  చెస్ అసోసియేషన్ కార్యదర్శి,  శిక్షకులు సతీష్ కుమార్,  రవ్వ రాంబాబు, ప్రభాకార చారి, కుక్కడపు సాలయ్య, భిక్షం, సందీప్, కళ్యాణ్, ఆర్నూర్ల రాము తదితరులు పాల్గొన్నారు.