రసాభసగా మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం

రసాభసగా మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం
  • మొక్కల‌ కొనుగోలు, సుందరీకరణ పనుల పేరుతో జరుగుతున్న అవినీతి పై  నిలదీసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు
  • సమావేశం బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభసాగా సాగింది. మున్సిపాలిటీ పరిధిలోని నర్సరీల నిర్వహణకు  లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, మరొకపక్కన పట్టణంలో మెయిన్ రోడ్ ల మద్యలో రోడ్డు పక్కన పెట్టడానికి  ఇతర ప్రాంతాల నుండి కోట్లాది రూపాయల వ్యయంతో మొక్కలు తెప్పిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆరోపించారు. సుందరీకరణ పనులకు స్ధానిక నర్సరీ ల మొక్కలు పనికిరావా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీళ్లు వారానికి రెండు సార్లు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జివో 26 నుండి నిధులు మంజూరు చేయాలని నియమ నిబంధనలు వున్నప్పటికి పలు రకాల పనులకు జివో 26 నుండి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీ కి స్వంత ట్రాక్టరు లు వున్నప్పటికి గుంతలు తవ్వడానికి 12 లక్షలు ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బైరు శైలేందర్ మాట్లాడుతూ 37 వ వార్డులో డ్రెయినేజీ లలో షీల్డ్  తొలగించడం లేదని మున్సిపల్ చైర్ పర్సన్ కు ఫోటోలు చూపించారు.  పట్టణంలో కుక్కలు, కోతుల సమస్య పెరిగిందని, మున్సిపాలిటీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించారు.