ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: బుధవారం సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలం సింగారెడ్డి పాలెం లో ఐకెపి నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ధాన్యం కొనుగోలు అయిన వెంటనే మిల్లులకు రవాణా చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా తేమ కొలిచే యంత్రం ద్వారా  పరిశీలించారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే అదే రోజు ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఓపీఎంఎస్ లో నమోదు చేయాలన్నారు ఎండలు తీవ్రంగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మిల్లుల వద్ద ధాన్యాన్ని దిగుమతి వెంటనే చేయాలని మిల్లర్లు హమాలీల సంఖ్యను  పెంచి దిగుమతులు త్వరగా అయ్యేలా చూడాలన్నారు కలెక్టర్ తో పాటుగా తాసిల్దార్ శేషగిరిరావు ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.