క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
  • సీనియర్ సివిల్ జడ్జి - జిట్ట శ్యాం కుమార్

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:క్రీడలు మానసిక,శారీరక ఆహ్లాదాన్ని కలిగిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని న్యాయస్థానంలో ఆయన ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించటం సంతోషకరమని అన్నారు. క్రీడలు స్నేహభావంతోనే ఆడాలని, క్రీడలు ఆడుతూ శత్రుత్వం పెంచుకోవద్దని అన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, ఓడినవారు నిరుత్సాహ పడకుండా గెలిచిన వాళ్లని ప్రోత్సహించాలని కోరారు. తాను కూడా జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ తో ఈ పోటీలలో పాల్గొంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో క్రీడల నిర్వాహకులు కాల్వ శ్రీనివాసరావు, మద్దుల నాగేశ్వరరావు, ఎంఎస్ రాఘవరావు, నరసింహారావు న్యాయవాదులు రవికుమార్, సత్యనారాయణ ,వెంకటేష్, వెంకటేష్ ,గోపీనాథ్ ,ప్రదీప్, వెంకట్ రెడ్డి ,కోర్టు సూపరింటెంట్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.