ప్రజలు ఇబ్బందులు పట్టించుకోని ఎమ్మెల్యే

ప్రజలు ఇబ్బందులు పట్టించుకోని ఎమ్మెల్యే
  • 6 మండలాల్లో ధ్వంసమైన రోడ్లు
  •  టీపీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్  మేడిపల్లి సత్యం


ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి అధికార ప్రతినిధి, చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం గంగాధర మండలం మధుర నగర్ లోని కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ భారీ వర్షాలకు  చొప్పదండి నియోజకవర్గం లోని రోడ్లు, కల్వర్టులు పూర్తిగా తెగిపోయాయి అన్నారు. వరద నీటితో పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి  రైతులు వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగిన నష్టంపై స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక్క కల్వర్టును, ఒక్క రోడ్డును  పరిశీలించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులను పరామర్శించి భరోసా ఇవ్వలేని దుస్థితిలో ఎమ్మెల్యే ఉండడం దురదృష్టకరం అన్నారు.అధికారులతో తూతూ మంత్రంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించింది లేదని విమర్శించారు.చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో ధ్వంసమైన రోడ్లను, కల్వర్టులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్  క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించి మరమ్మత్తులు ఎప్పుడు చేస్తారో తేల్చి చెప్పాలన్నారు.

రోడ్ల మరమత్తులు చేసే వరకు  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బొమ్మవేణి తిరుపతి,ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, దొంగ ఆనందరెడ్డి, చెలివేరి నారాయణ, వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, ఆదిరెడ్డి, పురం రాజేశం, రామిడి రాజిరెడ్డి, జవ్వాజి హరీష్,కోల రమేష్, బుర్గు గంగన్న, పంజాల శ్రీనివాస్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాడే శంకర్, ఏనుగుల కనకయ్య, రమేష్ , కడారి మల్లేశం, తోట సంధ్య కరణాకర్  , చిప్ప లావణ్య చక్రపాణి, పెరమళ్ళ గంగన్న,ముత్యం శంకర్, గడ్డం జీవన్ రెడ్డి,వొడ్నాల యగ్నేష్, నేరేల్ల సతీష్ రెడ్డి, సహు ఉదయ్, గాజుల అజయ్, వినోద్ రెడ్డి, మారుతి, తదితరులు పాల్గొన్నారు.