పనులు పూర్తికాకముందే పూర్తి బిల్లులు

పనులు పూర్తికాకముందే పూర్తి బిల్లులు

 శంకరపట్నం ముద్ర మే 16 :శంకరపట్నం మండలంలోని ధర్మారం గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై గ్రామసభ  నిర్వహించారు. ఈ సందర్భంగా ఈజీఎస్ సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన ఆడిట్ లో 2019 డిసెంబర్ నుండి 2023 మార్చి వరకు గ్రామంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ఈ తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వివరాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలోని స్మశాన వాటిక నిర్మాణం పనులు 10 లక్ష రూపాయలు  నిధులు ఈజీఎస్ పథకం ద్వారా విడుదల కాగా స్మశాన వాటిక పనులు పూర్తికాకముందుకే పూర్తి బిల్లులు తీసుకున్నట్లు తమ క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైనట్లు తెలియజేశారు. గ్రామస్థాయి తనిఖీల్లో వెళ్ళడైన ప్రతి ఈజిఎస్ పనుల సమాచారాన్ని మండల కేంద్రంలో నిర్వహించే ప్రజా వేదికలో ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఎస్ ఆర్ పి కొండల్ వెల్లడించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ చుక్కల రవి, పంచాయతీ కార్యదర్శి జీవిత, బి ఆర్ పి శివ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.