పార్టీ మార్పు అబద్ధం : ఎమ్మెల్యే ఈటల 

పార్టీ మార్పు అబద్ధం : ఎమ్మెల్యే ఈటల 
  • పార్టీ మార్పు అబద్ధం : ఎమ్మెల్యే ఈటల 

ముద్ర, హుజారాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.  గురువారం హుజూరాబాద్ లో ఆయన మాట్లాడారు. తాను పార్టీలో సైలెంట్ గా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నానని తెలిపారు. తనకు గొడవ పెట్టుకునే సంప్రదాయం లేదన్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదని, నిర్ణయాలు ఢిల్లీలో ఉంటాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం తధ్యమన్నారు.