సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు

సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు

ముద్ర న్యూస్ గన్నేరువరం: మండలంలోని గుండ్లపల్లి కెడిసీఎంఎస్ నిర్వాహకుడు అటికం తిరుపతి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకి జంగపల్లి గ్రామంలో  కోరమాండల్ వారి మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నాయని కనుక రైతులు మందు బస్తాల మీద పెట్టుబడి తగ్గించుకోవలాని, సేంద్రీయ ఎరువుల వాడకం పెంచాలని, పంట మార్పిడి చేస్తూ నేల సారాన్ని కాపాడాలని రైతులకి పలు సూచనలు చేశారు. మన పంట పొలాల నేల సారం తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు ఉచితంగా కంపెనీ వారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అటికం రాజేశంగౌడ్, డిసిఎంఎస్ నిర్వాహకులు మ్యాదరి శ్రీనివాస్, శ్రీదర్ రెడ్డి, ఉమ్మడి బేజ్జంకి మండల మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ బుర్ర కనకయ్య గౌడ్, చిలువేరు మల్లేశం, తాడూరి శ్రీనివాస్ రెడ్డి, అకేన వీరేశం, బొజ్జ మల్లేశం, నరేశ్, గుంటుక శ్రీశైలం, స్వామి,  రైతులు అధిక సంఖ్యలో హాజరై తమ మట్టి నమూనా పరీక్షలు చేపించడం జరిగింది. డి సి ఎం ఎస్ నిర్వాహకులు అటికం తిరుపతి,  కోర మండల్  కంపెనీ ప్రతనిధులు సేల్స్ ఆఫీసర్ వి. రాజేష్ కుమార్, అగ్రానమిస్ట్ టి. జగన్ మోహన్ రెడ్డి, ఎం. డి. టి  ఎన్.సతీష్, ఎం. డి. టి  జి అనిల్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.