జిల్లా స్థాయి క్రీడలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా స్థాయి క్రీడలకు ఏర్పాట్లు చేయాలి

జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: జిల్లాస్థాయి సీఎం చాంఫియన్‌ షిప్ ట్రోఫీ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌‌లో వెస్ట్‌ జోన్‌ డీసీపీ సీతారాంతో కలిసి చాంఫియన్‌ షిప్‌ ట్రోఫీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ ఈనెల 15న ప్రారంభమైన క్రీడాపోటీలు 24వ తేదీ వరకు జరుగాయన్నారు. మండల స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే రాష్ట్రస్థాయిలో పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జనగామ పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆయన ఆదేశించార.

సమావేశంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి గోపాల్ రావు, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఇన్‌చార్జి ఆర్డీవో ఏకే మన్సూరి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కలెక్టర్‌‌ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ కార్యదర్శులతో విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నెల 17 నుంచి 23 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తదితరులు పాల్గొన్నారు.