శాంతి భద్రతలే లక్ష్యంగా పనిచేయాలి

శాంతి భద్రతలే లక్ష్యంగా పనిచేయాలి

 శంకరపట్నం ముద్ర జూన్ 26 : హుజురాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  బి.సంతోష్ కుమార్ గారిని తెలంగాణ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో సోమవారం శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ స్టేట్ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతరం  అన్ని గ్రామాలలో శాంతి భద్రతల పర్యవేక్షణకై పాటుపడుతూ మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను, మండల కేంద్రంలోని ప్రజలందరితో మమేకమై శాంతిభద్రతలే లక్ష్యంగా పని చేయాలని తద్వారా ప్రజలు పోలీసులపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చిన వారవుతారని మండల కేంద్రంలోని ప్రతి ఒక్కరము పోలీసులకు ప్రతి విషయంపై అందుబాటులో ఉంటూ,మీకు సహకరిస్తారని అందుకు భీమ్ ఆర్మీ ద్వారా ఎల్లవేళలా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు కనకం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.