సిద్ధార్థ లో ఘనంగా బోనాల పండుగ

సిద్ధార్థ లో ఘనంగా బోనాల పండుగ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: స్థానిక భగత్ నగర్ లోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో బోనాల పండుగ ను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. బోనాలను అందంగా అలంకరించి పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. దీంతో పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సిద్ధార్థ హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పంచభూతాలను గ్రామదేవతలుగా భావించి బోనాన్ని నైవేద్యంగా సమర్పించే గొప్ప సంప్రదాయం వెనుక దాగి ఉన్న శాస్త్రీయత గురించి విద్యార్థులకు వెల్లడించడం జరిగిందన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్న నేటితరం విద్యార్థులకు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు వాటి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇలాంటి పండుగలు దోహదపడతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.