బీసీ కులవృత్తుల జాబితాలో పద్మశాలీలను చేర్చండి

బీసీ కులవృత్తుల జాబితాలో పద్మశాలీలను చేర్చండి

గన్నేరువరం ముద్ర  న్యూస్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల పెట్టుబడి సహాయం పథకంలో పద్మశాలీలను పరిగణలోకి తీసుకోకపోవడం అమానుషమని, పద్మశాలి చేనేత రంగం పెట్టుబడితో కూడుకున్నదని, అది పద్మశాలీల కులవృత్తి అని భాజపా నాయకులు గుంటుక లక్ష్మీపతి తెలిపారు. దానికి తోడు ప్రభుత్వం చేనేత రంగానికి చేయుతనివ్వకపోవడం, ఇప్పుడు బీసీ కులాలలో చేతి వృత్తులైన పద్మశాలిలను కుల వృత్తులుగా గుర్తించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు.

పద్మశాలి కులస్తులు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమయిందని, రాబోయే ఎన్నికలో ఓటుతో ప్రభుత్వంకు తగిన గుణపాఠం  చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బీసీ కుల వృత్తుల జాబితా లో పద్మశాలిలను చేర్చి చేనేత రంగానికి మరింత తొడ్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.