వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించండి

వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించండి

 డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :త్రైమాసిక పన్నులు చెల్లించని రవాణా వాహనదారులు తక్షణమే పన్ను చెల్లించాలని లేని పక్షంలో  తనిఖీ లలో  పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడం తో పాటు భారీ జరిమానా విధిస్తామని ఉమ్మడి  కరీంనగర్ జిల్లా  డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం  తిమ్మాపూర్ లోని రవాణా శాఖ కార్యాలయంలో కరీం నగర్, పెద్దపల్లి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల  జిల్లా రవాణా శాఖ అధికారులతో  సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన  మాట్లాడుతూ  2023 -24 సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన 345 కోట్ల  ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడం తో పాటు రహదారి భద్రత ను పెంపొందించేలా రవాణా శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు.

 ఓవర్ లోడ్ తీసుకొని వెళ్లే వాహనాలతో పాటు త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సు ల పై  దృష్టి సారించాలని సూచించారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని, టి ఆప్ ఫోలియో పై అవగాహన కల్గించాలని తెలిపారు. ప్రభుత్వ భూమి లేని రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధిత కలెక్టర్లను సంప్రదించి భూమి సాధించాలని, భూమి ఉన్న కార్యాలయాలు బిల్డింగ్ కట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశం లో కరీంనగర్, పెద్దపల్లి , జగిత్యాల  రాజన్న సిరిసిల్ల  జిల్లాల ట్రాన్స్ పోర్ట్ అధికారులు రంగారావు, అల్లె శ్రీనివాస్,ఉమా మహేశ్వర్ రావు,నాగలక్ష్మి,సిరాజుద్దిన్ ,మసూద్ అలీ, ,కిశోర్ చంద్ర రెడ్డి, మసూద్ అలీ ,భీం సింగ్, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, అశోక్, కరుణాకర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.