మహబూబాబాద్ యంఆర్ఓ పై దాడి..

మహబూబాబాద్ యంఆర్ఓ పై దాడి..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ యంఆర్ఓ ఇమ్మానియేల్ పై ఆదివారం దాడి చేశారు. ఈ..సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ శివారులోని సాలార్ తండా సమీపంలో కోర్టు కోసం 9 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మహబూబాబాద్ కు హైకోర్టు జడ్జి రావడంతో కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని చూపించే క్రమంలో ముందుగా వెళ్లిన మహబూబాబాద్ ఎమ్మార్వోతో తండావాసులు ఘర్షణకు ఘర్షణకు దిగారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, నిబందనలమేరకు తాము నడుచుకుంటామని రెవిన్యూ సిబ్బంది చెపుతున్న పట్టించుకోకుండా యంఆర్ఓ తో వాదనపెట్టుకున్నారు. అదే ఆవేశంలో యంఆర్ఓ ఇమాన్యుయల్ పై దాడికి దిగారు. మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి భూమిని కోర్టుకు ఎలా కేటాయిస్తారంటూ అరుస్తూ దాడిచేసారు. ఈ..హఠాత్ పరిణామంతో అస్వస్థతకు గుర ను మహబూబాబాద్ ఏరియా తరలించి చికిత్స అందిస్తున్నారు. యంఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.