హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి... 

హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి... 
  •  జిల్లా కలెక్టర్ శశాంక.. 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ను పురస్కరించుకొని మహబూబాబాద్ లో  సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో  శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్, సహాయ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్ డిఎఫ్ఓ రవికిరణ్  లతో కలిసి కలెక్టర్ శశాంక తెలంగాణ హరితోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ హరితోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని   జమాండ్లపల్లిలోని అర్బన్ పార్క్ లో మొక్కలను నాటారు. 

అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... మొక్కల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ ముందుగా తెలుసుకోవాలన్నారు హరితహారం కార్యక్రమం విశిష్టత ఇతర దేశాలు గౌరవించినంతగా మన దేశంలో  లేదని అందుకే పర్యావరణ సమతుల్యత లేకపోవడం వాతావరణం ప్రభావం చూపుతున్నది అన్నారు. కెనడాలో ప్రతి ఒక్క వ్యక్తిపై  తొమ్మిది వేల మొక్కలు ఉంటాయని అలాగే రష్యాలో కూడా 4500 మొక్కలు ఉండగా ఒక మనదేశంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయన్నారు.ఇకనైనా హరితహారం విశిష్టతను ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ప్రతి ఒక్కరు మొక్కల గురించి ఆలోచిస్తూ ప్రచారం చేస్తూ సంరక్షణ బాధ్యతను చేపడుతూ బాధ్యతగా ప్రవర్తిస్తూ ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇస్తూ నాటింపచేయాలన్నారు. ఈజీవన ప్రక్రియ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. జిల్లాలో 8 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉందని 3.60 లక్షల ఎకరాలు అడవి ఉండి తీరాలన్నారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తిస్తూ ప్రజా ఉద్యమంలా మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటిలో మామిడి జామ నిమ్మ అంటే ముక్కలే కాక పూల మొక్కలు కూడా నాటుకోవాలన్నారు.

ప్లాస్టిక్ వలన సముద్ర జీవులు చనిపోతున్నాయని సెల్ ఫోన్ల వల్ల రేడియేషన్ ప్రభావం చూపుతున్నదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పెరుగుతున్న జనాభా కు అనుగునంగా మొక్కలు శాతం పెరగవలసిన అవసరం ఉందన్నారు. అనంతరం హరితహారం పై నిర్వహించిన పోటీ పరీక్షలలో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ శశాంక ప్రశంసా పత్రాలను అందించారు.అంతకుముందు అటవీశాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మదర్ థెరిసా విగ్రహం వద్ద నుండి బస్టాండ్ వరకు నిర్వహించనున్న తెలంగాణ హరితోత్సవం ర్యాలీని దశాబ్ది ఉత్సవాల నోడల్ అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ తో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ పాటలచే హరితోత్సవం కార్యక్రమ విశిష్టతను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, జడ్పిటిసి ప్రియాంక, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ జిల్లా అధికారులు, అటవీ శాఖ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.