“ఆరోగ్యకరమైన ఆక్సిజన్ లభిస్తుంది”

“ఆరోగ్యకరమైన ఆక్సిజన్ లభిస్తుంది”

రామకృష్ణాపూర్,ముద్ర: మొక్కలు నాటుతూ చెట్లను పెంచడం మూలంగా ఆరోగ్యకరమైన ఆక్సిజన్ మనకు లభిస్తుందని చైర్ పర్సన్ జంగం కళ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం హరిత దినోత్సవ కార్యక్రమాన్ని క్యాతన పల్లి మున్సిపాలిటీ నర్సరీ, క్రీడా ప్రాంగణాలలో నిర్వహించారు.  ఈ సందర్బంగా కౌన్సిల్ సభ్యులు, అర్.పి ల అధ్వర్యంలో సుమారు 450 మొక్కలు నాటారు. అనంతరం డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి.సంతోష్ ను శాలువాతో సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు భూగోళాన్ని పరీక్షించడం, పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారని గుర్తు చేశారు. పచ్చదనాన్ని పెంచి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విద్యా సాగర్,కౌన్సిల్,కో ఆప్షన్ సభ్యులు,మేనేజర్ నాగరాజు, ఏఈ అచ్యుత్, మెప్మా టిఎంసి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.