కస్టర్డ్ యాపిల్ యూనిట్ భేష్: జిల్లా కలెక్టర్ రవి నాయక్

కస్టర్డ్ యాపిల్ యూనిట్ భేష్: జిల్లా కలెక్టర్ రవి నాయక్
District Collector Ravi Naik about Custard Apple Unit
  • కంటి వెలుగు శిబిరాలకు మొబిలైజేషన్ పెంచండి
  • ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచాలి
  • ధరణి దరఖాస్తులు ఎప్పటికప్పు డే పరిష్కరించాలని ఆదేశం 

జడ్చర్ల , ముద్ర:  మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వహిస్తున్న కస్టర్డ్ యాపిల్ యూనిట్ నిర్వహణ బాగుందని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు .శుక్రవా రం అయన నవాబ్ పేట తహసిల్దార్ కార్యాలయాన్ని, ఎంపీడీవో కార్యాలయాన్ని, మండల మహిళా సమాఖ్యలో నిర్వహిస్తున్న కస్టర్డ్ యాపిల్ యూనిట్ ను ఆకస్మి కంగా తనిఖీ చేశారు.ముందు గా తహసిల్దార్ కార్యాలయంలో ధరణి సెక్షన్ ను సందర్శించి ఇప్పటివరకు ధరణి కింద మండలంలో బుక్ అయిన స్లాట్స్, ప్రత్యేకించి శుక్రవారం బుక్ అయిన స్లాట్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన ఎండి. జహంగీర్ అనే భూ విక్రయిదారంతో జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ ధరణి కింద స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకు న్నారని? ఏ టైం ఇచ్చారని? అడిగారు .అనంతరం ఎంపీడీవో కార్యాలయం తనిఖీ చేసి ఎంపీడీవో శ్రీలత, ఎం పి ఓ , సి సి లతో మాట్లాడారు.  ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్య, చేస్తున్న పనుల వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్న అనం తరం మాట్లాడుతూ ఉపాధి హామీ కింద కూలీల సంఖ్యను పెంచాలని, ఇప్పుడు ఎలాంటి పంట కోతలు వంటివి లేనందున ప్రతి గ్రామంలో కనీసం 35 మంది కూలీలై న పనిచేసే విధంగా చర్యలు తీసుకో వాలని, ఇందుకుగాను ఎంపీడీ వో  ,ఏపీవో, సీసీలు క్షేత్రస్థాయిలో  అన్ని గ్రామాలలో తిరిగి కూలీల సంఖ్య పెంచే విధంగా చూడాలన్నా రు.

ఆ తర్వాత మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వహిస్తున్న కస్టర్డ్ యాపిల్ లు సెంటర్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో ఏం చేస్తున్నారని ? ఏ సీజన్లో సీతాఫలాలు వస్తాయని? గుజ్జు తీసి ఎక్కడికి పంపిస్తారని? సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందని ?ఎంత లాభం వస్తుందని ? వచ్చిన లాభాన్ని ఏం చేస్తున్నారని ?తదితర వివరాలను నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు .ఎంఎంఎస్ లో కస్టర్డ్ యాపిల్ యూనిట్ తో పాటు, చింతపండు యూనిట్ కూడా నిర్వహిస్తున్నామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కస్టర్డ్ యాపిల్ సేకరించి దాని ద్వారా గుజ్జుని తీసి స్కూప్  కంపెనీకి పంపిస్తామని ,దీని ద్వారా వచ్చిన లాభాన్ని మండలంలోని మండల మహిళా సభ్యుల సభ్యులకు పంపిణీ చేస్తామని, అలాగే దీంతో పాటు, చింతపండు తయారు ని కూడా రైతుల నుంచి సేకరించి చేస్తామని, గడచిన రెండేళ్ల నుంచి ఈ యూనిట్ ను నిర్వహిస్తున్నట్లు  ఎంపీడీవో శ్రీలత, నిర్వాహకులు కలెక్టర్ వివరించారు.

కస్టర్డ్ యాపిల్ ,చింతపండు యూనిట్ పనులకు హాజరైన అనంతరం తిరిగి వారి సొంత పనులు చూసుకుంటారని తెలిపారు. పక్కనే ఉన్న సీతాఫల్ విత్తనాలను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ ఇక్కడ వేరు చేస్తున్న సీతాఫల్ విత్తనాలను జిల్లాలోని  తెలంగాణ హరితహారం కింది నర్సరీలకు పంపించాలని తెలిపారు. ఇదే యూనిట్లో టమాట తయారు చేసేందుకు కూడా మహిళలు సిద్ధంగా ఉన్నారని ,అందుకు అనుమతి కోరగా జిల్లా కలెక్టర్ సమ్మతించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని ఎన్మనగండ్ల గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ జనాభా? 18 సంవత్సరాలు పైబడి ఉన్న వారి సంఖ్య? కంటి వెలుగు వైద్య శిబిరం కింద పరీక్షించాల్సిన వారి లక్ష్యం ?ఇప్పటివరకు పరీక్షించిన వారి సంఖ్య ?రీడింగ్ అద్దాలు పంపిణీ? ప్రిస్క్రిప్షన్ అద్దాల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, కంటి వెలుగు వైద్య శిబిరం వైద్యురాలితో అడిగి తెలుసుకున్నారు.

సర్పంచ్ భర్త హనుమంతు తో కంటి వెలుగు వైద్య శిబిరానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించుకునేలా చైతన్యం చేయాలని, ప్రతి ఒక్కరూ కంటి వెలుగు వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకునే విధంగా ముందే గ్రామంలో తెలియజేయాలని అన్నారు.కాగా ఇప్పటివరకు 1378 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 225 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేయగా, 106 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఇచ్చేందుకు ఆర్డర్ చేసినట్లు వైద్య అధికారులు కలెక్టర్ కు వివరించారు. స్థానిక సంస్థలు ,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు, నవాబుపేట ఎంపీడీవో శ్రీలత ,డిప్యూటీ తహసిల్దార్ లిఖితారెడ్డి ,తదితరులు ఉన్నారు.