ప్రతి విద్యార్థికి మార్కులతోపాటు మార్పు అవసరం..

ప్రతి విద్యార్థికి మార్కులతోపాటు మార్పు అవసరం..

 పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక ప్రేమానురాగాలు చొరవ చూపాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ప్రత్యేక అధ్యయన శిబిరం ముగింపు, పాదపూజ కార్యక్రమం తొర్రూరు లో జరగగా జిల్లా పాలన అధికారులతో కలిసి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ..సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..... చదువు జీవితాల్లో వెలుగులు నింపే జ్ఞాన నేత్రమని, తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, లక్ష్యం పట్టుదల భావనతో ఎదుగుదలకు తగు ప్రోత్సాహం అందించాలని  అన్నారు.  ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని సకల సౌకర్యాలు మౌలిక వసతులతో మన ఊరు - మనబడితో 7 వేల కోట్లుతో దఫాలవారీగా ప్రభుత్వ పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తున్నామని, కమిటీలో నేను నెంబర్ గా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.

పాఠశాలకు వెళ్లి వచ్చిన విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రేమ మమకారాలతో చెప్పిన పాఠ్యాంశాలను అడగాలని, నేడు చెప్పిన పాఠాలను తల్లిదండ్రులు అడుగుతారనే భావన, మా కోసమే మా తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నారనేది పిల్లల్లో కల్పించాలని సూచించారు. సెల్ పోన్, టీవీ మాధ్యమాలకు పిల్లలను దూరంగా ఉంచాలని, వ్యక్తిగత మేధస్సును పెంపొందించుకోవాలనికోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రైవేటుకు దీటుగా విద్యాభ్యాసం జరుగుతుందని 50 రోజులు నిర్వహించిన, వందేమాతరం ఫౌండేషన్ 18 సంవత్సరాల ఆకాంక్షను 10/10 మార్కులు సాధించి పేరు ప్రతిష్టలను, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి మీరు బహుమతిగా అందించాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో వందేమాతరం ఫౌండేషన్ సేవలు విద్యారంగంలో ఖ్యాతిని సంతరించుకున్నాయని, 18 సంవత్సరాలకు పైగా ఇలాంటి ప్రత్యేక శిక్షణ శిబిరాలతో ఎంతోమంది జీవితాల్లో రవీందర్ రావు వెలుగులు నింపినారని, జీవితాన్ని పిల్లలకు , విద్యార్థులకు అంకితమిచ్చిన వ్యక్తి అని అభినందించారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామిని అవుదామని వచ్చానని మంత్రి ఎర్రబెల్లి ఆనందం వ్యక్తం చేసారు. 

ప్రతి విద్యార్థి జీవితంలో మార్కులు కొలమానం కాదని, మార్పు అవసరమని, పిల్లలు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కారని పరిస్థితులు, వారిపై ప్రభావం చూపుతాయన్నారు. 400 మంది ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 50 రోజులపాటు విలువలతో కలిగిన విద్యను అందించడంతోపాటు కార్పోరేట్ స్థాయి విద్యార్థులకు దీటుగా శిబిరం ద్వారా మేలుకువలు నేర్పించడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఒక్క శిబిరానికి 25 నుండి 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని తెలిపారని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, పిల్లలు బాగా చదువుకోవాలని అన్నారు.  నితిన్ భవనంలో ప్రత్యేకంగా బాలికలకు 10 లక్షల రూపాయలతో డార్మెంటరీ ఏర్పాటు చేసామని, పూర్తి నిర్మాణ పనులకు 20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి దయాకర్ రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాషఅభినవ్, ట్రైనీకలెక్టర్ పింకేష్ కుమార్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రేవలేషన్ చైర్మన్ లక్ష్మారెడ్డి, జడ్పిటిసి శ్రీనివాస్, డి ఈ ఓ రామారావు, ఆర్డిఓ ఎల్ రమేష్, తహసిల్దార్ నాగేంద్ర ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులు అధికారులు
  పాల్గొన్నారు.