భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన బొడ్రాయి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన బొడ్రాయి ఉత్సవాలు
Bodrai Utsavam started with devotion
  • ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన మానుకోట
  • ఆడపడుచులు మరియు బంధువుల రాకతో ఇంటింటా సందడి
  • జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం స్థాపన
  • వేలాదిగా తరలిరానున్న ప్రముఖులు, బంధువులు

మహబూబాబాద్ పట్టణంలో జరుగుతున్న బొడ్రాయి పునః ప్రతిష్టాపనలో భాగంగా మూడవరోజు ఉదయం గోపూజ మరియు వివిధ పూజలతో ప్రారంభంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి నాభిశిల కు ప్రముఖ వేద పండితులు జలాభిషేకం ప్రారంభంగా ఈ జలాభిషేకం చేయడానికి పట్టణ కేంద్రం నుండి వేలాదిమంది బారులు తీరారు ఈ జలాభిషేకంలో  కుంకుమ పూజ మరియు యాగశాల వద్ద పూజల్లో పాల్గొన్న. మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పాల్గొనగా ఈ ఉత్సవాలు ముందుండి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు మరియు స్వచ్ఛంద సేవకులకు అభినందనలు తెరపడమేకాక మహిళ భక్తుల రాకతో బొడ్రాయి ప్రాంగణమంతా సందడిగా మారింది.

సాయంత్రం ఐదు గంటలకు మహిళా భక్తులచే ప్రారంభమైన కుంకుమ అర్చనలు వేదపండితులైన తాటిపాముల రాధాకృష్ణమూర్తి కౌశిక్ దుర్గాప్రసాద్ అభినవ శర్మ లచే దేదిపిమానంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కుంకుమార్చనలో వేలాది మంది మహిళలు పాల్గొని ఎన్నో వందల సంవత్సరాల తర్వాత నిర్మితమవుతున్న ఈ నాభి శిలా ప్రతిష్టాపన ఉత్సవంలో పూజలో పాల్గొనడం సేవలో భాగస్వామ్యం కావడం వీక్షించడం బొడ్రాయికి జలాభిషేకం చేయడం తమ తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడ్డారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి,మాలే నాగేశ్వరరావు, గిరిధర్ గుప్తా, నాళ్ళ నరసింహారావు,మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, ఎడ్ల రమేష్, ఎడ్ల వేణు, కర్పూరపు గోపి, పిల్లి సుధాకర్, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.