ఉత్సాహంగా సాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు

ఉత్సాహంగా సాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు

కేసముద్రం ముద్ర: గ్రామీణ స్థాయిలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో సోమవారం కేసముద్రం మండల స్థాయిలో వాలీబాల్ క్రీడ పోటీల్లో 12 జట్లు పోటీ పడగా ఇనుగుర్తి జట్టు ప్రథమ స్థానం దక్కించుకుంది. తాళ్లపూస పల్లి జట్టు ద్వితీయ స్థానాన్ని పొందింది. అలాగే మంగళవారం ఖో ఖో, కబడ్డీ క్రీడలు నిర్వహించారు. బుధవారం అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా క్రీడా పోటీల్లో కేసముద్రం ఇనుగుర్తి మండలాల కు చెందిన గ్రామాల నుంచి రెండు వందల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. చాలాకాలం తర్వాత గ్రామీణ స్థాయిలో కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించడం పట్ల క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు, నిర్వాహకులకు, పర్యవేక్షిస్తున్న అధికారులు, పీఈటీలకు కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.