మల్లు స్వరాజ్యం జీవితం సమాజానికే అంకితం చేసింది

మల్లు స్వరాజ్యం జీవితం సమాజానికే అంకితం చేసింది

నల్గొండ ముద్ర న్యూస్ : మల్లు స్వరాజ్యం జీవితం అంతా సమాజానికి అంకితం చేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ చెప్పారు. ఆమె మృతదేహాన్ని కూడా జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని ముందే చెప్పిందని అన్నారు. మార్చి 17 నుండి 19 వరకు సెటిల్ బ్యాట్మెంటన్ క్రీడలను నల్లగొండ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం క్రీడల్లో గెలుపొందిన వారికి  టౌన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్  అధ్యక్షతన జరిగిన  మల్లు స్వరాజ్యం  ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన ఇండోర్ షటిల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ముఖ్య అతిథి వచ్చిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం పేరుతో షటిల్ బ్యాట్మెంటన్ క్రీడలను నిర్వహించిన కుటుంబ సభ్యులను, క్రీడల్లో ఆడిన క్రీడాకారులను అభినందించారు.  గెలుపు ఓటములు ఎలా ఉన్నా క్రీడల్లో పాల్గొనడమే విజయంగా భావించాలని అన్నారు. వీర వనిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం  తను భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె జీవితమంతా ప్రజా పోరాటాలకు, కష్టజీవుల కోసమే పని చేసిందని గుర్తు చేశారు.

ఆమె తల్లి చోక్కమ్మ  చిన్నతనంలోనే తన సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి  తెచ్చుకున్న అమ్మనవలను స్వరాజ్యం తో చదివించడం వల్ల ఆమెపై ప్రభావం పడి నాటి నైజాం భూస్వామ్య వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలోకి వచ్చిందన్నారు. మల్లు వెంకట్ నరసింహ రెడ్డి, స్వరాజ్యం గార్లు గొప్ప ఆదర్శ దంపతులే కాకుండా ఈ సమాజానికి తన జీవితమంతా సాక్రిఫై చేశారని కొనియాడారు. నేటి నాయకుల్లాగా కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నారని చెప్పారు. వారిద్దరు కూడా నాకు తెలిసిన దగ్గర నుండి ఏనాడు కూడా ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సమాజనికి సేవ చేశారని చెప్పారు. అనేక ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించారని పేర్కొన్నారు. విఎన్  పేరుతో నల్లగొండ జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలు సిపిఎం చేపడుతుందని అన్నారు. వారు చేపట్టే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి  సిపిఎం జిల్లా సెక్రెటరీ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు నాగార్జున్ రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ఎంవిఎన్ ట్రస్ట్ కార్య నిర్వాహక కార్యదర్శి పి. నర్సిరెడ్డి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతయ్య , పిడి రాజ్ కుమార్ , ఆదిరెడ్డి సిఐ, డి ప్యూటీ ఈ ఈ ప్రభాకర్, గండూరి శ్రీనివాస్, శేఖర్, హేమంత్, ఉపేందర్ స్వామి, జనార్ధన్, దామోదర్, పంతులు మురళి, పార్ధు క్రీడాకారులు పాల్గొన్నారు.

ఫస్ట్ ప్రైస్ హేమంత్ కుమార్ - స్వామి
సెకండ్ ప్రైస్: వెంకట్ ఎఎస్సై-- సంపత్ యాదవ్
థర్డ్ ప్రైస్:  యాకల శ్రీనివాస్ - బిఎస్ఎన్ఎల్ కిరణ్ పంతులు శ్రీనివాస్
షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు.