కిడ్నాప్‌ కేసులో అతీక్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు

కిడ్నాప్‌ కేసులో అతీక్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు

లఖ్‌నవూ: ఉమేశ్‌ పాల్ కిడ్నాప్‌ కేసులో మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్ తోపాటు మరో ఇద్దరిని యూపీ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు  దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. అంతకుముందు.. నైనీ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత మధ్య నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు.

మరోవైపు.. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్  పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ అతిక్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు  కొట్టేసింది.  2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, రాజు పా…