గొర్రెల అభివృద్ధి పథకము సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీపీ జంగం శ్రీనివాస్

గొర్రెల అభివృద్ధి పథకము సద్వినియోగం చేసుకోవాలి:  ఎంపీపీ జంగం శ్రీనివాస్

పెద్దశంకరంపేట, ముద్ర: రెండో విడత గొర్రెల అభివృద్ధి పథకము అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. బుదవారం స్ధానిక మందల పరిషత్ కార్యాలయలో  జరిగిన రెండో విడత గొర్రెల అభివృద్ది పథకం లబ్ధిదారుల ఎంపిక కార్య క్రమంలో ఆయన పాల్గోని ప్రసంగించారు. కుల వృత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా  ఏర్పాటు చేసిన గొర్రెల అభివృద్ధి పథకాన్ని 2017లో ప్రారంభించారని గుర్తు చేశారు.

పెద్దశంకరంపేట మండలంలో ఈ విడతలో 318 యూనిట్లను ఎంపిక చేసినట్టు చెప్పారు. రెండో విడతలో లబ్ధిదారులకు 75% సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల ప్రత్యేక అధికారి, డిఎఫ్ఓ రవి ప్రసాద్, మండల తహాసిల్దార్ చరణ్ సింగ్, ఎఫ్ఆర్ఓ వికాస్, ఎంపీటీసీ  సభ్యులు వీణా సుభాష్ గౌడ్,  దత్తు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, యూనియన్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్లు,  ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.