కాంగ్రెస్ నాయకుల మాటలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం

కాంగ్రెస్ నాయకుల మాటలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం

ముద్ర, తిమ్మాపూర్ (జులై 21): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కోయాడ మురళి, నాయకులు మేడి అంజయ్య,వంతాడుపుల సంపత్,వడ్లురి శంకర్, మాతంగి లక్ష్మణ్ మాట్లాడుతూ దళిత బాంధవులు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ అని అన్నారు.ఇటీవలే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వారిపై అసత్య ఆరోపణలు చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సీఎం కేసీఆర్ గారు దళిత ఆత్మ గౌరవానికి ప్రతీకగా హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  నిలువెత్తు 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు.

అదే కాకుండా రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీం తీసుకొచ్చి ఎంతోమంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ని అన్నారు. మానకొండుర్ నియోజకవర్గం అభివృద్ధికి  అనునిత్యం ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తూ  నియోజవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్న నాయకుడు మన ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ .ఆయన తిమ్మాపూర్ మండలం తో పాటు నియోజకవర్గ కేంద్రంలో దళిత అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తూ దళిత బంధు పథకం కింద ఇదివరకు 500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చి వారి జీవితాల్లో వెలుగు నింపడంతోపాటు మండలంలో ఉన్న ప్రతి గ్రామ గ్రామాన ఎస్సీ హాల్ కమ్యూనిటీ హాల్ నిర్మించి వారి అభ్యున్నతికి,ఆత్మగౌరవానికి ఏక్కడ కూడా లోటు రాకుండా చూస్తున్నారు మరియు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహాలు లేకుండా ఉంటే  ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో  అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పి దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు.దీంతోపాటు దళిత బంధు పథకం కింద తిమ్మాపూర్ మండలంలో ఉన్న రామ్ హనుమాన్ నగర్ లో ఉన్న దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం ఇప్పించడంతోపాటు నేడు నియోజకవర్గంలో మరో 1100 వందల మందికి దళిత బంధు పథకం అమలు చేయడానికి కృషి చేస్తున్న దళిత బాంధవుడు మన ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ .

అలాంటి వ్యక్తిని మీ నాయకుని మెప్పు కొరకు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఎమ్మేల్యే పై  కాంగ్రెస్ నాయకుల అసత్య ఆరోపణలు వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ఇట్టి వాక్యాలను ఖండిస్తూన్నమని,రానున్న రోజుల్లో ఇదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తే మిమ్మల్ని,మీ నాయకుడిని తరిమికొడతాం అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పారునంది జలపతి,నగునూరి బాబు,కవ్వంపల్లి అంజి, గంగిపల్లి సంపత్,బోయిని తిరుపతి,దుర్గం అశోక్ కవ్వంపల్లి అంజి, కిన్నెర అంజి, తాళ్లపల్లి నందకిషోర్, గాజసాగర్,రోడ్డ రమేష్, తూర్పాటి అజయ్,అలువాల సంపత్,గోదరి రాజ మల్లయ్య, కనకయ్య, కామెర ప్రభాకర్ దప్పు తిరుపతి,సముద్రాల మల్లేష్,ఎనగందుల నరేష్, సతీష్,అసంపల్లి అశోక్,దుర్గం అభిషేక్ తదితరులు పాల్గొన్నారు