అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం
sreenivasa kalyana mahotsavam

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో 63వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణ వేడుకలను తిలకించి నేత్రానందభారీతలుయ్యారు. విచ్చేసినభక్తులకు తీర్థప్రసాదలు, కళ్యాణ అక్షిoతలు, మహా ఆశీర్వచనం చేశారు.

వేద పండితులు కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయ బద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. వైదిక క్రతువులు తిగుళ్ల విశు శర్మ, నంబి నరసింహచార్యులు నిర్వహించగా ఆలయ అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ , రుద్రాంగి శశాంక మౌళి రుద్రాంగి రాఘవ్, అజిత్ శర్మ తోపాటు ఆలయ ఈవో పణతుల వేణుగోపాల్, కమిటీ సభ్యులు ముంచాల రాంగోపాల్ , గౌర్శెట్టి రాజు, గౌరిశెట్టి రామమూర్తి దేశాయ్, బాశెట్టి లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.