నవ భారత దార్షనీకుడు.. సాంకేతిక విజ్ఞానానికి ఆద్యుడు..

నవ భారత దార్షనీకుడు.. సాంకేతిక విజ్ఞానానికి ఆద్యుడు..

దివంగత ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నాలుగు దశాబ్దాల క్రితమే భారత దేశంలో సాంకేతిక విజ్ఞానానికి బాటలు వేసిన భారత దార్షనీకుడు దివంగత రాజీవ్ గాంధీని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టి అధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ధర్మపురి బైపాస్ రోడ్డులోఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ  మాట్లాడుతూ దేశ సమగ్రతే ధ్యేయంగా, దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన శాంతికాముకుడు రాజీవ్ గాంధీ ని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని విద్య వ్యవస్థను పటిష్టం చేసి, నిరుపేద ప్రజలకు చదువును అందుబాటులోకి తెచ్చారన్నారు.

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ నినాదాన్ని నిజం చేస్తూ, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేసి పటిష్టం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యత, సమగ్రతను కాడడం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత రాజీవ్ గాంధిదే అన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడమే కాకుండా, నిధులు అవసరమని, నేరుగా  నిధులు విడుదల చేశారని, దేశ నిర్మాణంలో యువకుల పాత్ర అవసరమని భావించి, ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్ల కు తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేశారని అన్నారు. జూన్ 2 న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయసు ఉన్న వారు 7661899899 కు మిస్డ్ కాల్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని తెలిపారు.

60 ప్రశ్నలు, 60 నిమిషాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, నాయకులు  గిరి నాగభూషణం,  బండ శంకర్, తాటి పర్తి విజయలక్ష్మిదేవేందర్ రెడ్డి, గాజంగీ నందయ్య, గోపు రాజిరెడ్డి, కల్లే పల్లి దుర్గయ్య, నక్క జీవన్, గుండా మధు, సిరాజొద్దిన్ మన్సూర్, చాంద్ పాషా పాల్గొన్నారు.