మేం సచ్చిపోతాం.. మీదే బాధ్యత

మేం సచ్చిపోతాం.. మీదే బాధ్యత
: :
  • జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు టెర్మినేట్​ లేఖలు
  • తమకేమైనా జరిగితే అధికారులదే బాధ్యత అంటున్న జేపీఎస్​లు
  • ఇండ్లకు నోటీసులు అంటిస్తున్న వైనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు సమ్మెను కొనసాగించారు. క్రమబద్ధీకరణ కోసం సమ్మె చేస్తున్న జేపీఎస్​లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవ్వాళ సాయంత్రం 5 గంటలలోపు సమ్మె విరమించాలని వార్నింగ్​ ఇచ్చారు. కానీ, వారంతా సమ్మెలోనే కొనసాగారు. ఈ సందర్భంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. వారిని విధుల్లో నుంచి తొలిగిస్తున్నట్లు లేఖలు ఇచ్చేందుకు జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేశారు. దీంతో జేపీఎస్​లు అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల నుంచి తొలిగిస్తే.. తమకేమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని, తమ భార్యా, పిల్లల బాధ్యత తీసుకుంటామని లేఖ కూడా ఇవ్వాలంటూ చెప్తున్నారు. కరీంనగర్​ జిల్లాలో ఈ ఆడియో వైరల్​గా మారింది. కాగా, జేపీఎస్ ల ఇండ్లకు అధికారులు నోటీసులు అంటించారు.