సొంత గూటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కే ఎల్ ఆర్...

సొంత గూటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కే ఎల్ ఆర్...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి తిరిగి సొంత గూటికి చేర బోతున్నాడు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన లోక్ సభ స్పీకర్ మీరా కుమారి ని కలిసి చర్చలు జరిపారు. రెండు రోజుల ముందు కాంగ్రెస్ రాష్ట్ర  వ్యవహారాల ఇన్ చార్జీ మాణిక్ రావు ఠాక్రే, ఏ ఐ సీ సీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌధరీ లు కే ఎల్ ఆర్ ను ఆయన నివాసం లో కలిసి పార్టీ లోకి ఆహ్వానించారు.

ఇక నుంచి పార్టీలో క్రియా శీలకంగా పనిచేయాలని కోరడంతో లక్ష్మారెడ్డి సైతం సానుకూలంగా స్పందించారు.  కే ఎల్ ఆర్ కు పార్టీలో క్రియాశీలక భాద్యతలు అప్పగించేందుకు అధి నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ లక్ష్మారెడ్డి రెండేళ్ల క్రితం పార్టీకి రాజీ నామా చేశాడు. అప్పటి నుండి ఆయన ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నాడు.